
బ్రసీలియా : మితవాది జేర్ బోల్సనారో అధ్యక్షునిగా వును సమయంలో దాదాపు 800మంది బ్రెజిలియన్ ఆదివాసీలు హత్యకు గురయ్యారని వార్తా కథనం వెలువడింది. బ్రెజిల్‌లో ఆదివాసీలపై హింస పేరుతో నివేదికను ఇండీజనెస్ మిషనరీ కౌన్సిల్ (సిమి) ప్రచురించింది. బోల్సనారో పదవీకాలంలో దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు 795 వున్నాయని తెలిపింది. బ్రెజిల్ బిషప్స్ జాతీయ మహాసభ (సిఎన్‌బిబి)లో ఈ నివేదికను ఆవిష్కరించారు. ఈ సమావేశాలకు ఆదివాసీ నాయకులు, సిఎన్‌బిబి, సిమి ప్రతినిధులు హాజరయ్యారు. యానొమామి తెగ ఎక్కువగా వుండే రొరైమా, అమెజోనాస్ రాష్ట్రాల్లో ఈ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఆ రెండు రాష్ట్రాల్లో వరుసగా 208, 168మంది హత్య చేయబడ్డారు. మాటో గ్రాసో రాష్ట్రంలో 146 హత్యలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 2019, 2022 మధ్య కాలంలో అధిక సంఖ్యలో ఆత్మహత్యలు కూడా చోటు చేసుకునుట్లు నివేదిక పేర్కొంది. ఇలా ఆత్మహత్యలు చేసుకును వారిలో 535 మంది వుండగా, వారిలో దాదాపు మూడు వంతుల మంది పై మూడు రాష్ట్రాల్లోనే వున్నారు. భూ హక్కులపై ఘర్షణలు కూడా పెరిగాయి. ముఖ్యంగా 2022లో 158 హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నాయని నివేదిక పేర్కొంది.