Apr 26,2023 10:54

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రాష్ట్రం వ్యాప్తంగా డిఎస్పి స్థాయి పోలీసు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.  ఈ బదిలీలలో విశాఖపట్నం కు చెందిన అధికారులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా విశాఖపట్నం హార్బర్ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్.శిరీష ను కర్నూలు డిఎస్పీగాను, విశాఖపట్నం నార్త్ ఏసిపిగా పనిచేస్తున్న సిహెచ్. శ్రీనివాసరావును పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. వారి స్థానంలో హార్బర్ ఎసిపిగా ఇప్పటివరకు గుంటూరు సిసిఎస్ లో పనిచేసిన బి.మోసెస్ పాలను నియమించగా, నార్త్ ఎసిపి గా కాశిబుగ్గ సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న ఎం.శివరం రెడ్డిని నియమించారు. అదేవిధంగా అనకాపల్లి సబ్ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న బి.సునీల్ ను విశాఖపట్నం క్రైమ్ ఏసిపి గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వులలో పేర్కొన్నారు.