Jul 06,2023 08:31

డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిలో ఎండుద్రాక్షలు తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉండిి పిల్లలు, పెద్దలు అందరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. రుచి మాత్రమే కాక ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ పోషక పదార్థాలు ఈ ఎండుద్రాక్షలో దాగి ఉన్నాయి.

  • ఎండు ద్రాక్షలో రాగి అధికంగా ఉంటుంది. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
  • ఎర్ర రక్తకణాలు అధికంగా ఉత్పత్తి అయి రక్తం సరఫరా మెరుగు పడుతుంది.
  • హైబీపీ లాంటివి రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
  • అధిక శాతం ఫైబర్‌ ఉండటం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.
  • ఎండు ద్రాక్షను నానబెట్టిన నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  • ఇందులో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది.
  • పాలిఫినాలిక్‌ ఫైటో శరీరం వాపును తగ్గిస్తుంది.
  • యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.
  • ఇవి తినడం వల్ల పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది.
  • అధిక బరువు ఉన్నవారు తింటే త్వరగా బరువు తగ్గవచ్చు..
  • చర్మ, జుట్టు సంరక్షణలో బాగా పని చేస్తుంది.