May 11,2023 11:24

ప్రజాశక్తి-కసింకోట : ఈరోజు కసింకోట మండలం బుచ్చయ్యపేట గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో "మే డే " మాస ఉత్సవాలు సందర్భంగా ఆశా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కోన నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.శాంతి అక్కడికి హాజరైన వారందరికీ చల్లటి మజ్జిగను గ్లాసులలో పోసి అందించారు. ఈ కార్యక్రమం ఈ నెల అంతా కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా హాజరైన సి.ఐ.టి.యు. జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెలలో ఎండలు విపరీతంగా ఉన్నాయని ఇంటి నుంచి బయటకు కొద్ది దూరం వచ్చిన వెంటనే గొంతు ఎండిపోయే విధంగా వేడిగాలులు ఇస్తున్నాయని అన్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి చలివేంద్రాలు చాలాచోట్ల ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాలు, ఊరు పెద్దలు కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందు, చిన్నమ్మలు, నాయుడు, లక్ష్మి, మంగ, తదితరులు పాల్గొన్నారు.