
- సీపీఎం నగర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవుట వలన, దానిలో సిల్టు రెగ్యులర్ గా తీయకపోవడం వల్ల మచిలీపట్నం ప్రధానమైన రహదారులు ముంపుకు గురి అవుతున్నాయని దినివల్ల నగరంలో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నరన్నారు. ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్ నకు అనేకమంది గురి అవుతున్నారని సిపిఎం మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ మచిలీపట్నం నగరాన్ని సుందర నగరంగా, రూపురేఖలు మారుస్తామని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం సిపిఎం మచిలీపట్నం నగర కమిటీగా స్వాగతించుచున్నమన్నారు. అదే సందర్భంలో ప్రధానమైన డ్రైనేజీ వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, తరచూ చిన్నపాటి వర్షానికి ముంపు గురవుతున్న ప్రధానమైన రహదారులను, డ్రైన్లను పటిష్ట పరచాలని తద్వారా మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేయాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సీపీఎంనగర కార్యదర్శి బూర. సుబ్రహ్మణ్యం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజేష్, పార్టీ సీనియర్ నాయకులు కే.శర్మ, నగర కమిటీ సభ్యులు సిహెచ్.జయ రావు, ఎండి యునస్ తదితరులు పాల్గొన్నారు.