Sep 22,2022 17:04

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ (కృష్ణా) : కృష్ణా యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డులు వేడుక ఈ నెల 24న జరగనుంది. 2019-20, 2021-22 సంవత్సరాల్లో రాష్ట్రంలోని13 యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకు సంబంధించి ఆయా ప్రోగ్రాం సమన్వయకర్తలకు, ప్రోగ్రాం ఆఫీసర్లకు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలేంటీర్లకు అవార్డులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రధాన కార్యదర్శి శ్యామల రావు, ఐఏఎస్‌తో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి హాజరవుతున్నారు. వారితో పాటు వర్సిటీ ఉప కులపతి ఆచార్య కె.బి.చంద్రశేఖర్‌, వర్సిటీ రెక్టార్‌, రిజిస్ట్రార్‌, రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌, రీజినల్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొనున్నారు.