Nov 19,2022 12:26

ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ కటౌట్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.  దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం కాలింది.  మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి కటౌట్‌కు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని దండగలు నిప్పంటించి పారిపోయారు. విషయం తెలుసుకున్న బందరు డీఎస్సీ బాషా, పెడన రూరల్‌ సీఐ ప్రసన్న గౌడ్‌, గూడూరు ఎస్సై వెంకట్‌ ఎస్‌ఐ గణేష్‌ కుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కటౌట్‌ను దగ్ధం చేయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్‌ రావు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ ఎన్‌.ఏ.సలీం, వైసిపి దళిత నాయకుడు వెంకటేశ్వరరావు, వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.