Sep 17,2023 17:04

ప్రజాశక్తి-మామిడికుదురు : కాకినాడ వాసులు, వీసా వింగ్స్ ఓవర్ సీస్ కన్సల్ టెన్సి వారు  సుందరపల్లి వేంకట్రావు  తులసి దంపతులు మరియు వారి కుటుంబసభ్యులు వేంకట్రావు పుట్టినరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్-12వ తేదిన అన్నదానము జరిపించు నిమిత్తం (80,000/-) రూపాయలు అప్పనపల్లి,శ్రీ బాల బాలాజీ స్వామి వారి శాశ్వత నిత్య అన్నదాన ట్రస్ట్ నకు విరాళంగా ఇచ్చారు.వారికి ఆలయ సహాయ కమీషనర్ జి. మాధవి మరియు , ఆలయ ఛైర్మన్  చిట్టూరి రామకృష్ణ & ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు, కొమ్ముల సూరిబాబు, గూటం శ్రీనివాస్, ఆలయ అర్చకులు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంలు అందజేశారు.