Sep 22,2023 14:50
  • హడలెత్తిపోతున్న ప్రజలు

ప్రజాశక్తి - మండపేట : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మండలంలోని దాదాపు అన్నిగ్రామాల్లోనూ ఎక్కడ చూసినా కుక్కలు బాటసారులు, వాహనదారులపై దాడిచేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని ఏడిద, ఇప్పనపాడు, ద్వారపూడి,  వెలగతోడు, పాలతోడు, తాపేశ్వరం తదితర గ్రామాల్లోని వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే భయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట పడతుండడంతో ఆ వాహనాలకు నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోతున్నారు. కుక్కలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.