ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: మండలంలోని వి కొప్పరపాడు గ్రామంలో ఐదు సంవత్సరాలు బాలుడుపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం వి.కొప్పెరపాడులో బహిర్భూమికి వెళుతున్న 5 సంవత్సరాల వయసున్న డెపావత్ అయిష్ నాయక్ ,(తండ్రి) పేతురు నాయక్ అను విద్యార్ధి పై కుక్కలు దారుణంగా దాడి చేయగా అది గమనించిన గ్రామస్తులు వీధి కుక్కలను రాళ్లతో తరిమికొట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడని ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ లో చికిత్స చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు మండలంలోని గ్రామాల్లో వీధి కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










