
ప్రజాశక్తి-పాలకొల్లు : జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్, భారతీయ విద్యా భవన్ ల మధ్య వివాదం ముదురుతోంది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు భారతీయ విద్యా భవన్స్ ఆస్థులకు సంభందం లేదని ఇటీవల మాజీ మంత్రి చెరుకువాడ రంగనాదరాజు ప్రకటించిన నేపధ్యంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బుధవారం పాలకొల్లులో సమావేశం అయింది. ఈ నేపథ్యంలో పాలకొల్లు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెన్మెత్స శ్రీరామరాజు మిల్లు వద్ద సభ్యులు సమావేశం కాగా పాలకొల్లు పట్టణ సిఐ డి రాంబాబు, రూరల్ సిఐ కుడుపూడి సతీష్ సారధ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాలకొల్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మరాజు, కార్యదర్శి జడ్డు గాంధీ బాబు, వీరవాసరం సంఘ అధ్యక్షులు పోలిశెట్టి దాసు తదితరులు పాల్గొన్నారు