Mar 29,2023 11:00

ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం :  మండలంలోని సాంగుపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి చెవు కోసినట్లు సమాచారం. పరిస్థితి విషమించటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు కూడా అధికార పార్టీ వారేనని సమాచారం. చెవు కోసిన వ్యక్తి ఒక శాఖలో ఉద్యోగి అని సమాచారం.