Jun 19,2023 07:27

ఒకడు ఏసీలో తల దూర్చి
గోడలకు గొళ్ళేలు పెట్టాడు
ఇంకొకడు కూలర్లో కుదబడి
ఒళ్ళు చల్లార్చుకుంటున్నాడు
బతుకు లెక్క తూసుకుంటూ
వీధుల్లో ఐస్బోయిలు అమ్మే
పోరాటంలో పోటీలు పడ్డారు!

అందరికీ ఎండ ఒకటి కాదా?
ఒకడిది ఒళ్ళు దాచే పోరాటం
వేరొకని పొట్ట తూచే పోరాటం
ఒకరు ఎండకు దడిచి దాగితే
ఒకరిది ఎండలో కాగే బతుకు
బాప్‌ రే! శరీర ధర్మాలు ఒకటే
ధనం కూడే ధర్మాలే మారాయి !
ఇక్కడంతా ఆర్థిక తూకం వివక్షే
బతుకు భారం మాత్రం సాపేక్షం

- ఉన్నం వెంకటేశ్వర్లు