ప్రజాశక్తి-గణపవరం : సహకార రంగంలో వచ్చిన మార్పులతో వ్యాపార అవకాశాలు వినియోగించుకొని సభ్యులకు ప్రజలకు సేవలందించాలని ఆడిట్ జిల్లా అధికారి ఏ శ్రీనివాసరావు అన్నారు. సొసైటీ 69 వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం మొయ్యరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జరిగిన వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు వారోత్సవాలను సంఘ చైర్మన్ ఈదర అశోక్ చక్రవర్తి త్రివర్ణ పతాకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీ రైతులకు ప్రజలకు రుణాలు అందించడంలో ముందు భాగంలో ఉందని అన్నారు సొసైటీ సీఈఓ ఎండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీ ద్వారా స్వల్పకాలిక రుణాలు ఆరు కోట్ల 45లక్షలు దీర్ఘకాలిక రుణాలు 53లక్షల బంగారు నగలపై 40లక్షలు ప్రజలకు రైతులకు రుణాలందించామని చెప్పారు. రైతులకు ప్రజలకు సొసైటీ సిబ్బంది అందుబాటులో ఉండి సొసైటీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వారోత్సవాలు ఇంచార్జి ఆర్ శ్రీనివాసరావు, ఆడిట్ సూపర్డెంట్ పర్సన్ గంటాపద్మజ శెట్టి, అప్పిరెడ్డి, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.










