ప్రజాశక్తి-రావికమతం : రావికమతం మండలం టి.అర్జాపురం పంచాయితీ డోలవానిపాలెం గ్రామంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు సింగరపు వలసయ్య అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు అప్పారావు, పాడి బేన్నయ్య పోస్టర్ ఆవిష్కరణ చేశారు. నేడు బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశంలో అడవులను కార్పొరేట్ సంస్థలకు గ్రానైట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు అటవీ హక్కులు చట్టాన్ని సవరణ చేసింది. నూతన విద్యుత్ విధానం తీసుకొచ్చి. ఎస్సీ,ఎస్టీకి ఇచ్చినటువంటి సబ్సిడీలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు అమలు చేయడంతో ఈ దేశాన్ని బీజేపీ పార్టీ విధానాల నుండి కాపాడేందుకే దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 26వ తేదీ దేశ రక్షణ బేర్ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చోడవరం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది.










