Nov 06,2022 13:27

ప్రజాశక్తి-గణపవరం : మండల కేంద్రమైన గణపవరం నుండి ఏలూరు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు ఆర్టిసి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి మండల కమిటీ నాయకులు నరాల శెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో లింగరాజు మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు చివర మండలంగా ఉన్న గణపవరం ప్రజలు ఏలూరు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అధికారులు వెంటనే బస్ సౌకర్యం కల్పించాలని కోరారు అలాగే గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నాలుగు నెలలు దాటిన అమలు కాకపోవడం విచారకరమని అన్నారు. గ్రామాల్లో మంచినీరు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడం వలన ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. పంచాయతీలకు రావలసిన సొమ్ములు ప్రభుత్వం వాడుకొని గ్రామాల అభివృద్ధిని వెనక్కి నెట్టడం దారుణమని అన్నారు కేంద్రం నుండి రావలసిన నిధులు హోదా తదితర విషయాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు జగన్ కూడా బిజెపితో కలిసి ఏపీకి ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఏపీకి రావలసిన నిధులుపై రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకొని కేంద్రంపై పోరాటం చేయవలసిన బాధ్యత అధికారి పార్టీకి ఉందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ గణపవరం మండల కార్యదర్శి పి నరసింహమూర్తి, నాయకులు పి గోవిందు, ఎం పెంటారావు, ఎస్ సంజీవరావు, డి రామలింగరాజు పాల్గొన్నారు.