Oct 25,2023 16:43
  • జీవో నెంబర్ 12:35 అమలు చేయాలి
  • కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి బాబు

ప్రజాశక్తి-గణపవరం(పగో) : మండలంలో అర్థవరం దళిత పేటకు స్మశాన వాటికకు భూమి కేటాయింపులో అధికారులు నిర్లక్ష్యం తగదని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతిబాబు అన్నారు. బుధవారం అర్ధవ రం దళితపేట స్మశాన వాటికను జిల్లా కెవిపిఎస్ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతి బాబు మాట్లాడుతూ అర్థవరం దళిత మండలంలోని అతి పెద్ద దళితపేటగా ఉందని అన్నారు. 10:37 కుటుంబాలు వేలాది మంది ప్రజలు దళితుపేటలో నివసిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కేవలం 26 సెంట్లు భూమిలోనే స్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఏళ్ల తరబడి స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల జిల్లా స్పందనలో కెవిపిఎస్ ఇచ్చిన ఫిర్యాదు తో మండల అధికారులు అర్థవరం గ్రామంలో స్మశాన వాటికను పరిశీలించినట్లు చెప్పారు. అయితే స్థలం కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రతి దళిత పేటకు రెండు ఎకరాలు భూమిని స్మశానం వాటికగా కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీవో నెంబర్ 12:35 తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1000 కుటుంబాలు కల గ్రామంలో దళితులకు రెండు ఎకరాల భూమిని కేటాయించాలని క్రాంతి బాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని తాసిల్దార్ కార్యాలయం గ్రామ సచివాలయం వద్ద ఖననం చేసే విధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి చిన్న నాగేశ్వరరావు గ్రామ పెద్ద సగాల బత్తుల శ్యాముల్ యువజన నాయకులు చిన్నం నాగ పార్ధు, భవాని సింహ ఎస్ వంశీ పాల్గొన్నారు.