ప్రజాశక్తి-గణపవరం : గణపవరం మండలాన్ని తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్లో కాకుండా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెవిన్యూ డివిజన్ లో కలపాలని కోరుతూ గురువారం మండల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వినతి పత్రాన్ని సర్పంచుల సాంబార్ అధ్యక్షురాలు సనుమూరిలక్షిభావానిశివప్రసాదుస్తానిక.ఎంపిడివో. జి.జ్యోతిర్మయి కి.తాహశీల్దార్ సిఎచ్చ్. క్రిష్ణస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ భవాని శివ ప్రసాద్ మాట్లాడుతూ గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపడం వలన మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు} కృషి మేరకు మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలపడం హర్షించదగ్గ విషయమని అన్నారు అయితే ఇప్పటికే 90 శాతం మంది విద్య వ్యాపారాలు తదితర సంబంధించిన విషయాలపై అధిక శాతం ప్రజలు భీమవరం వెళుతున్నారని అన్నారు గణపవరం మండలాన్ని తాడేపల్లిగూడెం రెవిన్యూ డివిజన్ లో కలపడం వలన మండల ప్రజలకు సమస్యల తలెత్తే అవకాశాలు ఉన్నాయని అన్నారు మండలం పశ్చిమగోదావరిలో రెవెన్యూ డివిజన్ తాడేపల్లిగూడెం లో ఉండడం వలన ప్రజా సమస్యలు తొందరగా పరిష్కారం కావని అన్నారు అందువలన ప్రభుత్వం గణపవరం మండలాన్ని తాడేపల్లిగూడెం రెవిన్యూ డివిజన్ లో కాకుండా భీమవరం రెవిన్యూ డివిజన్ లో కలపాలని కోరారు జిల్లా రెవెన్యూ డివిజన్ ఒకే చోట ఉంటే ప్రజలు ఇబ్బంది పడరని అన్నారు ప్రభుత్వం వెంటనే గణపవరం మండలాన్ని భీమవరం రెవిన్యూ డివిజన్ లో కలిపి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం కలిగించాలని కోరారు










