
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం రూరల్ (జగన్నాధపురం): ఉపాధి హామీ పనులు కల్పించాలని ఉపాధిహామీ చట్టాన్ని పరిరక్షించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జగనాధపురం సచివాలయం దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం సచివాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ గ్రామాలలో వ్యవసాయ కూలీలకు పనులు లేక ఉపాదా మీ పనులు కోసం ఎదురుచూస్తున్నారని తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు పనైనా చూపండి తిండి అయినా పెట్టండి అంటూ పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పార్లమెంటులో వామపక్ష పార్టీలు ఎంపీలు కృషితో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అందులో భాగంగానే ఉపాధి హామీకి నిధులు తగ్గించడం జరుగుతుందని ఆయన అన్నారు ఉపాధి హామీని సమగ్రంగా అమలు చేయడానికి రెండు లక్షల నలభై వేల కోట్లు కేటాయించాలని ఉపాధి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని రెండు వందల రోజులు పనులు కల్పించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పీల గాది నాయుడు గజ్జరపు వెంకటేశ్వరరావు కోనవరపు నాగభూషణం ఆమర్తి చందర్రావు నల్లి శ్రీను పేర్ల వీర్రాజు గంప నూకరాజు తదితరులు పాల్గొన్నారు