ప్రజాశక్తి-రాంబిల్లి : గొర్రెలు మేకలు పెంపకం దారులకు ఉచిత ఇన్సూరెన్స్ కల్పించాలని, ఇన్సూరెన్స్ తో సంబంధం లేకుండా పశువైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా శ్రీరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోకాడ దేముడు నాయుడు లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సిసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెల మేకలు పెంపకం దారులకు వైయస్సార్ జీవ కాంతి పథకం ద్వారా ముఖ్యంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం దాన్ని ఏకపక్షంగా ఎత్తివేసి పెంపకం దారులు 20% చెల్లించి గొర్రెలకు మేకలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 40% కేంద్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని తెలపడం దుర్మార్గం అన్నారు. ఇప్పటివరకు మూడు నుంచి 20 జీవాలు వరకు ప్రభుత్వం ఉచితంగా ఇన్సూరెన్స్ లేకుండా నష్టపురం చెల్లిస్తుందని తీరా ఇప్పుడు ఆ పథకాన్ని ఎత్తిసి డబ్బులు చెల్లించ మనడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కోట్లుకు పైగా మృత్యువాత పడిన జీవాలకు నష్టపరిహారం చెల్లించ వలిసి ఉన్నప్పటికి చేల్లించలేదన్నారు. దీనిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పైగా ఇన్సూరెన్స్ చేయించుకున్న వారికి మాత్రమే పశు వైద్యం అందిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఎటువంటి సరతులు లేకుండా ఉచితంగా జీవాలకు వైద్యం అందించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెల మేకలు పంపకందారులకు కనీసంగా కూడా ఎటువంటి ఆర్థిక సహకారం అందించలేదని, రాబోయే బడ్జెట్లో అయినా పంపకందారులకు పదివేల కోట్లు కేటాయించి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జీవాలకు సరైన వైద్యం అందక వేలాదిగా మృత్యువాత పడుతున్నాయని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం డివార్మింగ్ కూడా అందించకుండా చేతులు దులుపుకోవడం అన్యాయం అన్నారు. గ్రామ గ్రామానికి అంబులెన్స్ మరియు వెటర్నరీ అసిస్టెంట్ లు ద్వారా జీవాలు కు వైద్యం అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం కనీసం మందులు కూడా నిధిలు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. చచివాలయానికి నెలకు 5000 రూపాయలకు విలువగల మందులు పంపిణీ చేస్తున్నామని కాగితల్లో చూపిస్తున్నారని వాస్తవంగా ఖర్చు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారయంత్రాంగం ప్రభుత్వానికి సరైన ప్రణాళిక తయారుచేసి అందించి పెంపకం దారులకు తగు మందులు సరఫరా అయ్యే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో చూపించలేదన్నారు. రాష్ట్రస్థాప్తంగా ఎన్ సి డి సి నిధులను విడుదల చేసి పెంపకం దారుల సహకార సంఘాలుకు ఋణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.










