Feb 02,2023 09:17
  • లెక్కలు తేల్చిన కేంద్ర బడ్జెట్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్ర ఖజానా భారీ లోటుతో కొనసాగుతోంది. ముగుస్తున్న 2022-23 ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా లోటు కష్టాలు తప్పడం లేదు. బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి లోటు నమోదవుతున్నట్లు లెక్కల్లో తేలింది. తాజాగా కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదన నేపథ్యంలో కొత్త ఏడాది రూ.17,86,816 కోట్లు ద్రవ్య లోటు ఉంటుందని ప్రతిపాదించారు. ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.16.6 లక్షల కోట్లు లోటు ఉంటుందని అరచనా వేయగా, అది చివరకు రూ.17,55,319 కోట్లుగా తేలిరది.

ఇక ఆదాయ లోటు కూడా భారీగానే ఉంది. గతేడాది ఆదాయ లోటును రూ.9,90,241 కోట్లుగా ప్రతిపాదించగా, చివరకు అది రూ.11,10,546 కోట్లకు చేరుకుంది. మార్చి నుంచి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు రూ.8,69,855 కోట్ల వరకు ఉరటురదని ప్రతిపాదించారు. ద్రవ్యలోటులో ఎక్కువగా మార్కెట్‌ బారోయింగ్స్‌ ద్వారా తీసుకున్న రుణాలే ఉన్నాయి. మొత్తం ద్రవ్యలోటులో ఈ విభాగం కింద రూ.17,58,861 కోట్లు తీసుకున్నట్లు లెక్కల్లో పేర్కొన్నారు. అలాగే చిన్న పొదుపు సంస్థలో సెక్యూరిటీల ద్వారా రూ.4,38,919 కోట్లు, స్టేట్‌ ప్రావిడెరడ్‌ ఫండ్‌ ద్వారా రూ.20 వేల కోట్లు, ఇతర రుణాల ద్వారా రూ.79,902 కోట్లు. ఎక్స్‌టర్నల్‌ రుణాల ద్వారా రూ.23,874 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు.