Jul 17,2023 22:45

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఆదాయం పెంపు విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆదాయ వనరుల శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల కలెక్టర్లను కడా భాగస్వాములను చేస్తే ఆదాయం మరింతగా పెరుగుతుందన్నారు. ఈ మేరకు కలెక్టర్లతో నిరంతరర సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆదాయం పెరచే విధానంపై కలెక్టర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భాగంగా ఆర్థికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో అనునిత్యం మాట్లాడాలని నిర్దేశించారు. కలెక్టర్లు చొరవ చూపితే ఆదాయ వనరుల శాఖలు మరిరత బలోపేతం అవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మట్లాడుతూ అన్ని శాఖల్లో ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఖర్చులకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్నారు. ఆదాయ వనరులకు చెందిన అనిు శాఖల అధికారులు తమ పరిధిలో ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు. జిఎస్‌టి వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు 91 శాతం లక్ష్యానిు సాధించినట్లు పేర్కొన్నారు. జిఎస్‌టి పన్నులు 7,653 కోట్లు వసూలైనట్లు వివరించారు. గతేడాదితో పోల్చిచూస్తే ఇది 23.74 శాతం పెరుగుదలగా ఉరదనివారు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇదే విధంగా ఆదాయాన్ని మరిరతగా పెంచాలని దిశా నిర్ధేశం చేశారు.

  • మద్యం తగ్గింది.. ఆదాయం పెరిగింది

మద్యం అమ్మకాల్లో ఆదాయం పెరిగినట్లు ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2018-19తో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు బాగా తగ్గినట్లు వారు వివరించారు. 2018-19లో 384 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగ్గా, 2022-23లో 336 లక్షల కేసుల అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ నాటు సారా అమ్మకాలు చేస్తున్న కుటుంబాలపై దృష్టి సారించాలని, వారికి ప్రత్యామాుయ ఉపాథి చూపించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగినట్లు ఆ శాఖ అధికారులు వివరించారు. గతేడాది ఏప్రిల్‌ నురచి జూలై వరకు 2,292 కోట్ల ఆదాయం లభించగా, ఈ ఏడాది ఆదే కాలంలో రూ. 2,793 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు వారు వివరించారు. గనుల శాఖలో కూడా 2018-19లో 1,950 కోట్లు ఆదాయం రాగా, 2022-23 నాటికి 4,756 కోట్లు ఆదాయం పెరిగిందని గనుల శాఖ అధికారులు వివరించారు. ఎపిఎండిసి ద్వారా కూడా ఆదాయం పెరిగినట్లు వివరించారు. గనుల శాఖలో పారదర్శకత, సంస్కరణల కారణంగానే ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

  • రవాణా రంగంలో సంస్కరణలు

రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి సారించాలని ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, అందులో ఉత్తమమైన వాటిని రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచిరచారు. వాహనాలపై వసూలు చేస్తున్న పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని సూచించారు. అయితే ఈ విధానం వాహన కొనుగోలుదారులను ప్రోత్సహించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు కీలక శాఖల అధికారులు పాల్గొన్నారు.