Jan 09,2023 08:00

శిఖర సౌందర్యం ప్రశంసనీయమే
అదే క్రమంలో లోయ సొగసు గొప్పదే
దేనికీ ఎప్పుడూ కంపించని
మనో ధారుఢ్యంతో పాటు
చలనసహితమైన జీవితాన్ని వదలకూదని తెలియట్లా ?

అహంకారం , అనుమానం ప్రమాదమని
ఇప్పటికైనా తెలియక పోతే ఎట్లా?
మనిషి అవసరం కోసమే ఏదైనా స్వీకరించడం,
ఇది చాలనుకోవడం సులకనేం కాదు
అది తక్కువతనం అంతకన్నా కాదు

కడలి కెరటం దూకుడు ఒకరైతే
నదీలో అల నడక మరొకరిది
ఎప్పుడూ దేనికీ ఇది లేదని, అది లభించలేదని
దు:ఖించరాదని తెలుసుకోకపోతే ఎట్లా?
ఉన్నది చాలు
ఇక్కడుంటే చాలు
కీర్తి కిరీట ధారి ఒకరైతే
తలగుడ్డ వారసత్వం ఇంకొకరిది
ఇక్కడ ఒక మంచి మనిషిగా బతగ్గలగడమే
ఏ మనిషికైనా అందం, అలంకారం !

- రవి నన్నపనేని
9182 181390