Jul 09,2023 21:56

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ను మరోసారి భారీ వరదలు ముంచెత్తున్నాయి. గతేడాది వరదల నుంచే ఇప్పటికీ కోలుకోలేక విలవిలాడుతున్న పాక్‌లో మళ్లీ భారీ వర్షాలు కారణంగా వరదలు విజృంభిస్తున్నాయి. దీంతో కొనిు రోజుల నుంచి ఆదివారం వరకు 76 మంది ప్రాణాలు కోల్పోగా.. 133 మందికి గాయాలైనట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెలరోజులుగా కురుస్తోను వర్షాలకు అనేక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. కేవలం పంజాబ్‌ ప్రావిన్సులోనే ఇప్పటివరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్‌ పంఖ్తుఖ్వా ప్రావిన్సులో 20 మందితోపాటు బలోచిస్థాన్‌లో ఐదుగురు చనిపోయినట్లు సంస్థ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.