ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని చెముడులంక నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో దసరా ఉత్సవాలు కరస్పాండెంట్ యెరుబండి శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విద్యార్థులకు, తల్లితండ్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగలలో దసరా అతి ముఖ్యమైనదన్నారు. విజయం దశమి అనగా విజయానికి నాంది అన్నారు. విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఇందులో మహిషాసుర మర్థనం నాటక ప్రదర్శన చూపరులందిరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సత్యనారాయణ, పాఠశాల ఇంచార్జ్ పద్మావతి, ప్రిన్సిపాల్ సునంద, టీచర్లు ప్రవీణ, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.










