
దోమకాటు వల్ల విష జ్వరాలు, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరి. వీటిని పూర్తిగా అరికట్టవచ్చు.
- ఇంటి పరిసర ప్రాంతంలో నీరు నిల్వ ఉన్న గుంతల్లో వేప పిండిని చల్లాలి. దీనివల్ల దోమల గుడ్లు చనిపోతాయి.
- నీటి తొట్టి, ట్యాంకు, కుళాయిల దగ్గర, మురికి కాలువల వద్ద వేపకాయల పిండిలో పసుపు కలిపి చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
- కిరోసిన్‌లో వేప నూనె పోసి ఇంట్లో దీపం వెలిగిస్తే దోమలు రావు.
- చామంతి పూలకు కొంచెం పేడ కలిపి చిన్న చిన్న బిళ్లలుగా చేసి ఎండ పెట్టాలి. ఆ బిళ్లలను రాత్రిపూట వెలిగిస్తే ఆ వాసనకు దోమలు పోతాయి.
- బంతిపూల చెట్ల ఆకులు బాగా చేదుగా ఉంటాయి. ఈ మొక్కలను ఇంట్లోగానీ, ఇంటి పరిసర ప్రాంతాల్లో గానీ ఉంచితే దోమలు రావు.
- నిమ్మకాయను సగానికి కోసి దానిలో లవంగం మొగ్గను గుచ్చి ఇంట్లో దోమలు ఉండే ప్రదేశంలో ఉంచితే ఉపయోగం.
- ఇంట్లోగానీ, పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.