
ప్రజాశక్తి-దేవరాపల్లి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా అమలు చేస్తూ ముందుకు పోతుందని, దీని వలన పేదలు మరింతగా చదువుకు దూరమోతారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాద్యాక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. సోమవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. గత సంవత్సరం పాఠశాలలు విలీనం చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా 2,15,320 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, ఇంకో మూడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చేరారని తెలిపారు. జిఓ నెం 117 మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయన్నారు. గత నాలుగేళ్లలో ఒక డిఎస్సీ కూడా తియ్యకుండా ఉపాధ్యాయులను హేతుబద్ధీకరణ పేరుతో సర్దుబాటు చేసి కేవలం 9000 మాత్రమే ఖాళీ పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతుందని అన్నారు ఇటీవల పార్లమెంటులోను రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచితంగా విద్య అందించాలి కానీ ఈవిద్యా సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫీజులు 2000 రూ.ఉన్న ఫీజున కొన్ని గ్రూపులకు 9000 రూ.వరకు పెంచిందన్నారు. ప్రతి సంవత్సరం డిగ్రీ చదివే వారి సంఖ్య తగ్గి పోతుందని తెలిపారు. ఈసంవత్సరం కూడా అదే కొనసాగుతుందని.మొత్తం 4,92,820 సీట్లకు గాను మొదటి విడతలో 38.25% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని, 16 కాలేజీల్లో ఒక్కరూ కూడా జాయిన్ అవ్వలేదని తెలిపారు. మరో 150 కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం వాటి గుర్తింపును రద్దు చేసిందని తెలిపారు. నేటికీ ఇంకా అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని. డిగ్రీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకు రావడంవల్ల ప్రైవేట్ కాలేజీల్లో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈవిద్యా సంవత్సరం నుండి డిగ్రీలో నాలుగు సంవత్సరాల హానర్స్ డిగ్రీ అమలు చేస్తుందని.దీనివలన ఈ డ్రాపౌట్స్ మరిన్ని పెరుగుతాయన్నారు.
దేశంలో మన ప్రక్కనె ఉన్న తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలకు వైద్య కళాశాలలు మంజూరయ్యాయని, ఏరాష్ట్రంలో లేని విదంగా వైద్య విద్య సీట్లు అమ్ముకానికి పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వంమేనని అన్నారు 107, 108 జీవోలు తీసుకువచ్చి 50% సీట్లు సెల్ ఫైనాన్స్ కోర్సుల్లో భర్తీ చేస్తుందని. దీనితో లక్షల్లో ఫీజులు కట్టలేక బడుగు బలహీన వర్గాల వారికి వైద్య విద్య అందుకుండా పోతుందన్నారు. రాష్ట్రంలో 16 యూనివర్సిటీలకు గాను 3,450 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి హేతు బద్ధీకరణ పేరుతో 850 పోస్టులు కుదించి చివరికి 2635 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు.
కృత్రిమ మేధస్సు (ఎఐ) వలన ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరుగుతుందని అన్న విమర్శలు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సును విద్యారంగంలో తీసుకు రావడానికి ఒప్పందం కుదుర్చుకుందన్నారు దీనివలన విద్యార్థులు చార్జీపీట్లో అన్ని ఉంటాయి కాబట్టి తన సొంత మెదడుకు పని చెప్పడం మానేస్తారని తెలిపారు.ఫలితంగా మెదళ్లు మొద్దు బారుతాయన్నారు గతంలో ఈ రకంగానే బైజూస్ తో ఒప్పందం చేసుకున్నారని. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించారని ట్యాబ్ లో ఉన్న సిలబస్ వేరు వారి పాఠ్యపుస్తకంలో ఉన్న సిలబస్ వేరు కావడంతో విద్యార్థులకు ఇది ఏరకంగా ఉపయోగపడలేదన్నారు. మరోవైపు ఆట్యాబులకు అలవాటు పడ్డ విద్యార్థులు చదువు పక్కన పెట్టి నిరంతరం ఆ ట్యాబ్ తోనే కాలక్షేపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈనూతన విద్యవిదానం వల్ల విద్యార్థులు చదువులకు మరింత దూరం అయ్యే ప్రమాదం ఉందని వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు.