ప్రజాశక్తి-నందిగామ : సంక్రాంతి పండుగ సందర్భంగా అయ్యప్ప స్వామి గుడి సమీపంలో గురువారం నందిగామ ఎసిపి నాగేశ్వర రెడ్డి సిఐ సతీష్ నందిగామ పోలీస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ప్రారంభించారు. నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు బ్యాటింగ్ చేయగా సిఐ సతీష్ బౌలింగ్ చేశారు. నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు సూర్యకుమార్ లాగా షాట్లతో అలరించారు.
సీఐ సతీష్ బుమ్రా లాగా బౌలింగ్ చేసి యువతను ఉత్సాహపరిచారు. నందిగామ సిఐ సతీష్ మాట్లాడుతూ సిపి కాంతి రానా టాటా డీసీపీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు ఏసిపి నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించామని అన్నారు. సంక్రాంతి సందర్భంగా యువత చెడు మార్గంలో కోడిపందాలు పేకాటకు ఆకర్షతులు అవుతున్నారని వాటిలో పాల్గొనడం వల్ల ఆర్థికంగా నష్టపోయి వారి కుటుంబాలకు ఇబ్బందులు వస్తాయి అలాంటి చెడు మార్గాలకు వెళ్లకుండా ఉండాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించమని సిఐ సతీష్ తెలిపారు.
ఈ సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని సిఐ సతీష్ అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలు ఎస్సై సురేష్ ఎస్సై పండు దొర సిబ్బంది చూసుకుంటున్నారు.










