- రూ.6.3 కోట్లు చెల్లించాలని జిఎడికి సిఆర్‌డిఎ లేఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆలూలేదు.. చూలూ లేదు... అన్నట్లుగా ఉంది రాజధాని ప్రారత అభివృద్ధి సంస్థ తీరు. రాజధాని ప్రారతంలో నిర్మాణంలో ఉన్న భవనాలపై అద్దె చెల్లిరచాలని సాధారణ పరిపాలనశాఖకు లేఖ రాశారు. రాజధాని నిర్మాణం కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లిరచేందుకు ఈ అద్దె సొమ్ము ఎరతో అవసరమని పేర్కొనడం గమనార్హం. మొత్తం నెలకు రూ.6.30 కోట్లు అద్దెగా ఇవ్వాల్సి ఉంటుందని కూడా లేఖలో పేర్కొన్నారు.
రాజధాని ప్రారతంలోని రాయపూడి, నేలపాడు గ్రామాల్లో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఇతర ఎన్‌జిఒలకు భవనాల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైరది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ భవనాల నిర్మాణం ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా తుప్పలు, ఇతర వ్యర్ధాలతో నిండిపోయి కనిపిస్తోంది. ఈ భవనాలను పూర్తయినట్లుగా అధికారులు చెబుతుండడం విశేషం.
ఈ భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తూ ఆ శాఖ నుంచి అద్దె వసూలు చేసేరదుకు గత ఫిబ్రవరిలో సిఆర్‌డిఎ, జిఎడి మధ్య ఒప్పరదం కుదిరింది. ఈ భవనాల్లో మొత్తం 3,840 యూనిట్లు ఉన్నాయి. ఇందులో 3,201 యూనిట్లు లీజుకు అర్హత కలిగినవిగా ఉన్నట్లు సిఆర్‌డిఎ అధికారులు పేర్కొన్నారు. ఏ భవనాల్లోని యూనిట్లకు ఎంత అద్దె ఇవ్వాలన్నది కూడా ఒప్పందంలో ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెలే క్వార్టర్లకు రూ.50 వేలు, ఎఐఎస్ అధికారుల క్వార్టర్లకు రూ.40 వేలు, ఉద్యోగుల వసతికి రూ.15 వేలుగా అద్దె ఖరారు చేశారు. ఇలా వచ్చే అద్దెను తమకు రుణమిచ్చిన యూనియన్ బ్యాంకుకు వాయిదాలుగా చెల్లించాలని సిఆర్‌డిఎ అధికారులు నిర్ణయించారు. ఎస్క్రో విధానం ద్వారా భవిష్యత్తు ఆదాయాన్ని రుణానికి చెల్లిస్తామని బ్యాంకుతో జరిగిన ఒప్పందాన్ని కూడా అధికారులు గుర్తు చేస్తున్నారు. అందుకే బ్యారకు వాయిదాలు చెల్లిరచేందుకు ఈ అద్దె డబ్బులను వెంటనే ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాయడం తాజా పరిణామం.
- వసతి, క్వార్టర్లు, అద్దె వివరాలు (రూ.కోట్లలో)
విభాగం క్వార్టర్లు నెల అద్దె మొత్తం నెలకు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 288 50,000 1,44,00,000
ఏఐఎస్ అధికారులు 144 40,000 57,60,000
నాన్ గెజిటెడ్ 1,488 15,000 2,23,20,200
గెజిటెడ్ అధికారులు 288 25,200 72,00,000
గెజిటెడ్ గ్రేడ్-2 273 20,000 54,60,000
గ్రూప్-డి ఉద్యోగులు 720 11,000 79,20,000
మొత్తం 3,201 6,30,60,000










