- హైకోర్టుకు తెలిపిన సిఆర్‌డిఎ
ప్రజాశక్తి-అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపునకు రూ.200 కోట్లు విడుదల చేసినట్లు హైకోర్టుకు సిఆర్‌డిఎ తెలిపింది. ఈ మేరకు జిఓ జారీ అయ్యిందని, త్వరలోనే ఆ డబ్బు భూములిచ్చిన వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని సిఆర్‌డిఎ తరపున న్యాయవాది పేర్కొన్నారు. ఇవే వివరాల్ని లిఖితపూర్వకంగా నివేదించాలని సిఆర్‌డిఎను న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ శుక్రవారం ఆదేశించారు. కౌలు చెల్లింపులో జాప్యం చేయడాన్ని ప్రశ్నిస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.










