ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ప్రముఖ వైద్యులు కొంగర దేవదాస్ (70) విజయవాడలో మంగళవారం కన్నుమూశారు. ఆయన తన కుమారుడు, పేరొందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కొంగర రవికాంత్ వద్ద ఉంటున్నారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన కుమారుడి ఇంట్లో తుదిశ్వాస విడిచారు. దేవదాస్‌కు భార్య సుగుణ, కుమారులు శ్రీకాంత్, రవికాంత్, కుమార్తె ఉన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించిన ఆయన నెల్లూరు ప్రజావైద్యశాలలో వైద్యులుగా పనిచేశారు. వామపక్ష ఉద్యమానికి తనవంతు సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం హుజూర్‌నగర్‌లోనూ వైద్యులుగా పనిచేశారు. ఆయన కుమార్తె కూడా వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. దేవదాసు భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.