Sep 17,2023 13:06

ప్రజాశక్తి-విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఉక్కు రక్షణ యాత్రను జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కకరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణ త్యాగాలతో 16 వేల మంది రైతులు 22 వేల ఎకరాల భూత్యాగ ఫలంతో లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ రక్షించుకొని తీరుతామని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ ప్రాంత ప్రజలు గత 1000 రోజులుగా పోరాడుతున్నారు.  అయినా కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు లేదు సరి కదా దీని అమ్మడం సాధ్యం కాకపోతే మూసేస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపు పూనుకున్నారు . దీనిని నిరసిస్తూ ఈనెల 20వ తేదీ నుండి 29వ తారీకు వరకు ఉత్తరాంధ్ర బైక్ యాత్ర సిపిఎం పార్టీ చేపట్టింది. పాలకుల మెడలు వంచి పోరాడి సాధించుకున్న ఈ ప్లాంట్ ను తిరిగి అటువంటి పోరాటాల ద్వారానే మొండిగా ఉన్న మోడీ ప్రభుత్వం మెడలు వంచి రక్షించుకోవడం సాధ్యమని ఇదే ప్లాంట్ పరిరక్షణకు ఏకైక మార్గమని తెలియజేస్తూ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే సోమనాయుడు, రామ్ కుమార్, కన్ను నాయుడు ,బి రంగారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.