Oct 15,2023 13:09

ప్రజాశక్తి-పిప్పర : 2014 నుండి విద్యుత్ చార్జీల వసూలు విధానం చూస్తుంటే దొంగలు పడ్డా ఆరు నెలలకి కుక్కలు మొరిగిన చందంగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కం శెట్టి సత్యనారాయణ అన్నారు. బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్న విద్యుత్ చార్జీల కు వ్యతిరేకంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా పిప్పర బస్టాండ్ సెంటర్లో *సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం జరిగింది. మొత్తం 198 ఓట్లు పోలవగా విద్యుత్ ఛార్జీలు పెంపుకు *వ్యతిరేకంగా 195 ఓట్లు పోలవగా *అనుకూలంగా 3 ఓట్లు పోలయ్యాయని పోలింగ్ నిర్వహించిన నిర్వాహకులు పి. గోవింద్ తెలిపారు.
 ఈ సందర్భంగా సత్యనారాయణ పి గోవిందు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఓటింగ్ నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును వెనక్కి తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుతం వాడుతున్న విద్యుత్ కంటే గతంలో వాడిన విద్యుత్తు వినియోగదారులపై యూనిట్కు అదనంగా 80 పైసలు  వసులు చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు అంశాన్ని వెనక్కి తీసుకోపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు నరాల శెట్టి రామకృష్ణ సోడ దాసిసంజీవరావు గుత్తుల శ్రీనివాస్ మెంటే సూర్యారావు ఓగిరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.