
ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 115 లో 23, 15 సేంట్లు అక్రమణుకు గురైన దేవుని భూమిని వెంటనే స్వాధీనానికి అడ్డుపడద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న శుక్రవారం ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు నాయుడుకు బహిరంగ లేఖ వ్రాసారు అనంతరం దీనికి పత్రికలకు విడుదల చేసారు.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో 23,15 సేంట్లు కోట్లాది రూపాయలు విలువ చేసే దేవుని భూమి దుర క్రమణనుకు గురైయింది దీనిపై సిపిఎం పార్టీ స్పస్టమైన ఆధారాలు తో ,దీన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని దేవదాయ ధర్మదాయ శాఖ కమీషనర్ విజయవాడ వారికి అనకాపల్లి జిల్లా దేవదాయశాఖ అస్టేంటు కమీషనర్ వారికి గతరెండు సంవత్సరాల నుండి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగింది దీనిపై వారు దర్యాప్తు జరిపి దేవుని భూమిగా గుర్తించి 22 A1C చేర్చుటకు అనుమతి కొరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి సమయంలో తమరు అసిస్టెంట్ కమీషనర్ అనకాపల్లి వారికి కమీషనర్ విజయవాడ వారికి పోన్ చేసి ఈసర్వేనెంబరు గలభూమి రిజిస్ట్రేషన్లు ఎవిదంగా నిలుపుదల చేసారని, మీకుఎవరు అధికారం ఇచ్చారని, మీదగ్గర ఏఅదారాలున్నాయని, పోన్లుద్వారా అదికారును బెదిరిస్తున్నారు, దీనికి సంభందించిన అన్ని ఆధారాలు సిపిఎం పార్టీదగ్గర ఉన్నాయి,అయినప్పటికి ఈవిధంగా దేవదాయశాఖ అదికారులపై వత్తి చేయడం మీస్తాయికి సరియైనదికాదు, ఇప్పటివరకు ఈభూఅక్రమణలో మీకు ఎటువంటి సంభంధం లేదని మేము బావించాము , కానిమీరు గత కోంతకాలం నుండి దేవదాయశాఖ అదికారులకు పోన్ చేసి రిజర్వేషన్లు కోనసాగించే విదంగా చర్యలు తీసుకోవాలని 22A1C లో చేర్చడానికి విలులేదని వత్తిడి చేస్తూన్నారు దీనివలన మీకు మీపార్టికి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈభూమి పూర్వం మారేపల్లికి గ్రామానికి చేందిన అవుగడ్డ సఖూరినాయుడు ధర్మకర్తగా ఉన్నట్లు 10 (1) రికార్డు లో ఉంది,1956 తరువాత కాలంలో భూమి సేటిల్ మెంట్ అయిన తరువాత సెటిల్ మేంటు ఫేయిర్ ఆడంగల్ లో శ్రీరాములువారి దేవస్థానం పేరున సేటిల్ మేంటు అయినది, దీన్ని తారువా గ్రామానికి చేందిన అల్లు గౌరు నాయుడు అను పేరును ప్రక్కనే సేటిల్ మెంట్ ఫేయిర్ ఆడంగల్ లో వ్రాసెసు కోని విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టును అశ్రమించగా 1999 లో గౌరవ మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు విశాఖపట్నం వారు అక్రమణ దార్లుకు ఈభూములు చేల్లుబాటు కావని స్పస్టమైన తీర్పును ఇవ్వడం జరిగింది అయిప్పటికి అక్రమణ దార్లు ఈభూములకు
తప్పుడు రికార్డులు స్రుస్టించి దేవదాయశాఖ అదికారులు కళ్ళు గప్పి అమ్మేసారు ప్రస్తుతం,దేవుని మాన్యాన్ని కోనుగోలు చేసుకున్న రీయల్ ఎస్టేట్ వ్యాపారి దేవరాపల్లి తహశీల్దార్ వారికి పట్టాదారు పాస్ బుక్కులు మంజూరు కొరకు ధరఖాస్తు చేసుకోనగా దేవరాపల్లి తహశీల్దార్ RC,NO 100/2022 A తేదీ,19/5/2022 న ఈభూమి సేటిల్ మెంట్ ఫేయిర్ ఆడంగల్ ప్రకారం దేవుని మాన్యంగా ఉందని పాస్ బుక్కులు ఇవ్వాలంటే దేవదాయ శాఖ అధికారులు నుండి క్లీరెన్సు కావాలని శ్రీదేవదాయశాఖ అస్టేంటు కమీషనర్ అనకాపల్లి వారికి వ్రాయడం జరింది దీనిపై RC,NO 4/2022 తేదీ 14/6/2022న దేవదాయశాఖ అధికారులు ఇది దేవుని మాన్యంగా శ్రీ రాములు వారి దేవస్థానం భూమిగా ఉందని ఈభూమికి ఎటువంటి పట్టాదారు పాస్ బుక్కులు కోనుగోలు దారునికి ఇవ్వడానికి వీలులేదని భూమి కోనుగోలు చేసిన వ్యక్తులు,వారికి భూమిపై ఎటువంటి హక్కులు ఉన్న ట్రిబ్యునల్ కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలని గతంలో భూములు అమ్మిన వ్యక్తులకుగాని, కోనుకున్న వ్యక్తులకు గాని ఎటువంటి అధికారం ఈభూమి పై లేదని,దేవదాయశాఖ అస్టేంటు కమీషనర్ అనకాపల్లి వారు దేవరాపల్లి తహశీల్దార్ వారికి వ్రాస్తు, శ్రీశ్రీశ్రీ శ్రీరాములు వారి దేవస్థానం పేరున పాస్ బుక్కులు ఇవ్వాలని ధరఖాస్తు పెట్టడం జరింది,దింతో తహశీల్దార్ పట్టాదారు పాస్ బుక్కు కోసం ధరఖాస్తు పెట్టుకున్న వారికి, తహశీల్దార్ వారు పాస్ బుక్కు తిరష్కరించారు వీటి ఆధారం గాను మరియు సేటిల్ మేంటు ఫేయిర్ ఆడంగల్ ప్రకారం కోర్టు తీర్పు ప్రకారం ఇది దేవుని మాన్యంగా రుజువు అయ్యింది, దీంతో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ అనకాపల్లి వారు దీనిలో బోర్డులు పెట్టుకోనుటకు సహాకారం కావాలని తేదీ 14/7/2023 న మరియు 17/7/2023 న రెండు సార్లు దేవరాపల్లి తహశీల్దార్ కు లెటర్ వ్రాసియున్నారు అయిప్పకి మీ వత్తడి వలన తహశీల్దార్ వారు దేవదాయశాఖ అదికారులకు సహకరించ లేదు దింతో సింగిల్ ట్రస్టు ఇండోమేంటు ఇన్స్పెక్టర్ దేవదాయశాఖ వారు తేదీ 31/7/2023న ఈసర్వేనెంబరు తో పాటు మారేపల్లి రెవెన్యూ లో మరికొన్ని సర్వే నెంబర్లు గల భూములు అమ్మకాలు కోనుగోలు చేల్లుబాటు కావని ఇవిమారేపల్లి శ్రీ రాములు వారికి చేందివని పత్రిక ప్రకటన చేసి యున్నారు అయిప్పకి రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రతి ఆదివారం మార్కెట్ డే నిర్వహించి అమ్మకాలు చేపాడుతున్నారని తెలుసుకోని తేదీ 19/8/2023 న జిల్లారిజిస్టర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్ మేంటు అనకాపల్లి వారికి లెటర్ వ్రాస్తు ఈభూమి దేవుని మాన్యమని మేము 22A1C చేర్చుటకు దేవదాయశాఖ కమీషనర్ విజయవాడ ,(గోళ్ళపూడి)వారికి RCNO A3 /261/23 తేదీ,12/4/2023 లేటర్ వ్రాసియున్నామని 22A1C చేర్చే వరకు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయాలని కోరియున్నారు దింతో సర్వే నెంబర్ 115 తో పాటు మరికొన్ని సర్వేనెంబర్లు గల భూములు రిజిస్ట్రేషన్లు నిలిచి పోయాయి దింతో మీరు దేవదాయశాఖ అధికారులపై తీవ్రమైన ఓత్తిడి చేస్తూన్నారు, 22A1C చేర్చకుండా మీరాజకీయ పలుకుబడిని ఉపయోగించి కమీషనరెట్ లో పైల్ నిలుపుదల చేసారు, మారేపల్లి దేవుని మాన్యం విషయంలో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రత్యేక్షంగాను పరోక్షంగా ను సహకరించిన ప్రతిదానికీ మాదగ్గర సాక్షలు ఉన్నాయి అయినప్పకి ,మీకు, మీరాజకీయ ఎదుగుదలకు నష్టం కలిగించ రాదని,మాపార్టి బావిస్తున్నది కావున మంచి మనస్సుతో అలోచించి దేవదాయశాఖ అదికారులపై ఎటువంటి వత్తిళ్ళు చేయకుండా వెంటనే 22A1C చేర్చుటుకు సహకారాన్ని అందించాలని దేవదాయశాఖ అదికారులపై ఎటువంటి వత్తిళ్ళు చేయవద్దని వెంకన్న అలేకలో పేర్కొన్నారు,