ప్రజాశక్తి-విశాఖ : సిపిఎం సీనియర్ నాయకులు, జిల్లా ఆఫీసులో అకౌంట్స్ నిర్వహిస్తున్న వి.కృష్ణమూర్తి (ఆరిలోవ) తెల్లవారుజామున 1గం. సమయంలో గుండెపోటుతో మరణించారు. అతని భౌతికకాయాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, తదితరులు సందర్శించారు. కృష్ణమూర్తి మృతదేహంపై ఎర్ర జెండా కప్పి, అతని మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. పార్టీ సభ్యులు, కార్యకర్తలు అన్ని మండలాల్లో సంతాపాన్ని తెలియజేస్తున్నారు.










