Jan 25,2023 10:53
  • గిరిజనులకు సాగునీటి అందించాలి

ప్రజాశక్తి-అనకాపల్లి: అసంపూర్తిగా నిలిచిపోయిన పెద్దెరు ఎడమ కాలువ పునులు వెంటనే పూర్తి చేసి గిరిజనులకు నీరు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న గిరిజన సంఘం ఐదవషేడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇ నరసింహమూర్తి వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కె భవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, బుదవారం అసంపూర్తిగా నిలిచిపోయి పెద్దెరు ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు, పెద్దెరు ఎడమ కాలువ ద్వారా  ఎల్ గవరవరం ఓండ్రివీది ఎల్ క్రిష్ణపురం గదబవీది పాతగవరవరం కాంకోట కోండ్లపాడు కొండవీది,గ్రామాల్లో మూడు పంచాయతీలకు 1500 ఎకారాలకు సాగునీరు అందించాలని ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం కాలువ పనులకు భూసేకరణ చేసి రైతులకు డబ్బుకూడ చేల్లించి పనులు మొదలు పెట్టి  అసంపూర్తిగా పనులు చేసి వదిలి పెట్టెసారని తెలిపారు. దీంతో గిరిజనులు అప్పటి నుండి దశలవారీగా అందోళన చేయడంతో పాటు,రిటార్డ్ చీప్ ఇంజినీర్ ఇరిగేషన్ సలహాదారు సత్యనారాయణ, ఈప్రాంతాన్ని సందర్శించి గతప్రభుత్వనికి నివేదిక సర్పించడంతో ప్రభుత్వ స్పందించి నిదులు మంజూరు చేసి,సర్వే కూడా నిర్వహించడం జరిందన్నారు. కాని ఈప్రభుత్వం కావాలనే గిరిజనులు పట్ల వివక్షతో తోక్కి పెట్టిందన్నారు. ఈకాలువ పనులు పూర్తి చేస్తె గిరిజనులకు పదిహేను వందల ఎకారాలు వరకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు గిరిజనులు భూములకు సాగునీరు అందిస్తె రెండు పంటలు పండించు కోవడంతో పాటు వారి అర్దిక పరిస్థితి మేరుగు పడుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉపముఖ్యమంత్రి ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందిస్తామని గిరిజనులకు హమి ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు నాలుగు ఎళ్ళు అవుతుందని కాని మంత్రి పట్టించుకోలెదన్నారు. దీని వలన గిరిజనులు భూములు బీడు బారుతున్నాయని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పెద్దెరు ఎడమ కాలువ పనులకు నిదులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని మంత్రి గారు మాట నిలబెట్టుకోవాలని గిరిజనులకు సాగు నీరు అందించాలని వారు డిమాండ్ చేసారు,