Apr 17,2023 14:46

ప్రజాశక్తి-రేపల్లె టౌన్ : కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ రాజకీయ ప్రచారంలో బాగంగా 21 తేదీ రేపల్లెలో జరిగే ప్రచారం జయప్రదం చేయాలని  పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. సీపీఎం కార్యాలయంలో జరిగినా ఉమ్మడి సమావేశంలో సీపీఎం, సీపీఐ నాయకులు పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్.మణిలాల్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పి.నాగంజనీయేలు  మాట్లాడుతు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బిజెపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని, ధరలు పెద్ద ఎత్తున పెంచుతున్నారు. బిజెపి కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులు ఉందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను రోజురోజుకీ పెంచుకుంటూ పోతుందని విమర్శించారు.బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుందని, ప్రజలందరూ ఐక్యంగా ఉండి మోడీని సాగనంపాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్- ఇవన్నీ పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చినా హామీలు వీటిలో ఏ ఒక్క దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ర్టంలో అనేక త్యాగాలు ద్వారా సాదించుకొన్న విశాఖ ఉక్కుని, అదానీకో జిందాల్ కో,మరో కార్పొరేట్ కంపెనీకో కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తుంటే,రాష్ట్రప్రభుత్వం కూడా మెతక వైఖరి ఆవలంబిస్తూ ఇద్దరు కలిసి ప్రజలని మోసం చేస్తున్నారని విమర్శించారు,మోడి ప్రభుత్వం మతతత్వ దొరణలు రెచ్చగొడుతూ,ప్రజసమస్యలు పై ప్రశ్నించకుండా,ప్రజలు ఐక్యం కాకుండా చేయడానికి ఎక్కడికక్కడ మతకలహాలు వివాదాలు రేపుతున్నది. అనేక మతాలు కులాలు,భాషల సంస్కృతితో కూడిన భారతదేశాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రేపల్లె ఏరియా కార్యదర్శి జి.బాలాజీ, సీపీఎం, సీపీఐ నాయకులు కె.ఆశ్విరాధం, కెవి.లక్ష్మణరావు, బి.శ్రీనివాసరావు, పి.నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.