Oct 14,2023 13:13
  • సిపిఎం నాయకులు ఖండన

ప్రజాశక్తి-నందిగామ : ప్రజా సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకుడు కర్రీ వెంకటేశ్వరరావు పై నందిగామ సొసైటీ చైర్మన్ పాములపాటి రమేష్ ఫోన్ చేసి దుర్భాషలాడటం సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు చనుమెాలు సైదులు, నందిగామ పట్టణ కమిటీ సభ్యులు ఖాసింలు పేర్కొన్నారు. శనివారం  నందిగామ సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైదులు మాట్లాడుతూ శనగపాడు సప్లై ఛానల్ కింద రెండు వేల ఎకరాలు సాగు ఉందని నందిగామ అనాసారం గ్రామాల చివర భూములకు సాగునీరు రావడంలేదని రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రైతు సంఘాల నాయకులు శనగపాడు సప్లై ఛానల్ కాలవపై పర్యటించి రైతులతో కలిసి ఆందోళన చేయడం జరిగింది అన్నారు. శనగపాడు సప్లయ్ ఛానల్ పై జరుగు తున్న పనులు కూడా పరిశీలించటం జరిగిందని తెలిపారు. 
 తమ పార్టీ నాయకుడు కర్రి వెంకటేశ్వరరావుకు నందిగామ సొసైటీ చైర్మన్ పాములపాటి రమేష్ గురువారం రాత్రి ఫోన్ చేసి ఎవరు రమ్మంటే వచ్చారని , నందిగామ నుండి మీకు రావాల్సిన అవసరం ఏమిటంటూ దుర్భాషలాటం సరికాదన్నారు. ఇప్పటికైనా పాములపాటి రమేష్ విజ్ఞతతో ఆలోచించి ఆత్మ విమర్శ చేసుకోవాలని, రైతు సమస్యలపై ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు అభినందించాలని సూచించారు. సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం మాట్లాడుతూ ప్రజాసమస్యలు రైతాంగ సమస్యలపై సిపిఎం పార్టీ గత 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తుందని, సాగునీరు లేక రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చేస్తుంటే, నందిగామ సొసైటీ అధ్యక్షుడు పాములపాటి రమేష్ ఫోన్ చేసి తమ నాయకుడు కర్రి వెంకటేశ్వరావు దుర్భాసులాడటం మంచి పద్ధతి కాదన్నారు. అధికార పార్టీలో ఎదుగుదల ఉన్న నాయకుడు మరింత ఎదగాలి గాని తన స్థాయి తగ్గించుకొని వ్యక్తిగత దూషణలకు పాల్పటం సరైన పద్ధతి కాదన్నారు. రైతాంగ సమస్యలపై సిపిఎం నాయకులు చేస్తున్న ఆందోళన హర్షించాల్సింది పోయి ఫోన్లు చేసి దూషించవలసిన అవసరం లేదని ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.