Oct 15,2022 20:49

ప్రజాశక్తి-విజయవాడ : మతతత్వశక్తుల పాలనలో దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధన కోసం మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాల్సి ఉందని సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అన్నారు. దీనికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించి ప్రజా పోరాటాలను నిర్మించాలని సూచించారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కమ్యూనిస్టులు తమ శక్తియుక్తులన్నింటినీ వినియోగించి ఐక్యంగా పోరాడాలని అన్నారు. భగత్‌ సింగ్‌, అంబేద్కర్‌, పూలే, పెరియార్‌ తదితరుల కలలను నిజం చేసేందుకు ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టంగా పునర్నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత దేశంలో నెలకొందని చెప్పారు..