ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయనటానికి కావలి ఘటనే నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహించారు. ఏపీలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని అన్నారు. కావలి సమీపంలో మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను వైసిపి గుండాలు చితకబాదటం దుర్మార్గమని పేర్కొన్నారు. బస్సు హారన్ మోతకే వైసిపి బేజారెత్తిపోతోందని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వైసీపి గూండాలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.