ప్రజాశక్తి-విశాఖ : 1964 సహకార చట్టానికి చేసిన చట్ట సవరణలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘముల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.రామకృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి ఎల్.ఎ.అర్.ఆంజనేయులు ఆధ్వర్యంలో 20 మంది సభ్యులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం డి.ఆర్.వో కి ఇచ్చారు.
- డిమాండ్స్
1) పిఎసిఎస్ లలో 50% వాటాలను ప్రయివేట్ వ్యక్తులకు, కంపెనీలకు ఇస్తూ మరియు రైతు భరోసా కేంద్రాలను పిఎసిఎస్ లలో విలీనం చేస్తూ 1964 సహకార చట్టానికి చేసిన చట్ట సవరణలు రద్దు పర్చాలి.
2) జిఓ ఎంఎస్ నెం.38 ప్రకారము వేతనాలను అమలు పర్చాలి, మోనిటరీ బెనిఫిట్స్ 1/4/2016 నుండి చెల్లించాలి, మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీని గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలు పర్చాలి.
3) రాష్ట్ర సహకార బ్యాంక్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కలసి డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలి. 36 జిఓ జీతాలు పూర్తిగా అమలు చేసి, బకాయి జీతాలు చెల్లించి న తదుపరి, సంఘాలలో కంప్యూటరీకరణ పూర్తి అయిన తరువాత మాత్రమే ట్రాన్స్ఫెర్స్ అమలుచేయాలి.
4) జిఓ ఎంఎస్ నెం 36లో ఉదహరిచిన డిఏ శాతానికి కోత విధించి యున్నారు. సదరు మార్గదర్శకాలలో ఇచ్చిన 24.90% ను వెంటనే సవరించాలి.
అమలు చేయాలి.
5) 1" ఏప్రియల్ 2019నకు వేతన సవరణ చేయవలసియున్నది. వెంటనే వేతన సవరణ జరిపి అమలుచేయాలి.
6) జిఓ 36లో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిటైరెమెంట్ వయస్సు 62 సం.లకు పెంచాలి.