May 11,2023 10:47

ప్రజాశక్తి-రావికమతం : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో 11 గ్రామాల ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ పథకాలు ఇంటికి చేరాలంటే ప్రత్యేక సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉపాదా మీ కూలీలు అజయ్ పురం, పెదగరువు రాయిపాడు, కడగడ్డ, బంగారు బందరు ఆందోళన చేపట్టడం జరిగింది. 11 గ్రామాల్లో 596 రేషన్ కార్డులు మరియు ఉపాధి హామీ కార్డులు (జాబ్ కార్డులు) కలిగి ఉన్నాము. గతంలో కేంద్ర ప్రభుత్వం పనిచేసిన ఉపాధి హామీ పథకం ఆఫ్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మాస్టర్ సీట్లు ఇచ్చి పనిచేసిన వారికి హాజరు చేసేవారు. NPCI సిస్టం వచ్చిన తర్వాత ఉపాదా మీ పని చేసిన తర్వాత మాస్టర్ సీట్ ని అప్లోడ్ చేయాలంటే  సిగ్నల్ ఉండాలి. కొన్ని సందర్భంలో మస్టర్ సీట్ అప్లోడ్ అవడం లేదు. కూల్ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు.కానీ మా ప్రాంతంలో సెల్ టవర్ లేకపోవడంతో మస్టర్ సీట్లు అప్లోడ్ చేయాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్లి కొండెక్కి మస్టర్ సీట్లు అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఇదే విధంగా రేషన్ సరుకులు కోసం కొండపైకి ఎక్కి ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంది. OAP పెన్షన్లు కూడా డోలుమోసుకొని సిగ్నల్ ప్రదేశానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు డిజిటల్ సేవలను చెప్పి మా ఆదివాసి ప్రాంతాల్లో సెల్ టవర్ లేకపోవడంతో పథకాలకు దూరం చేస్తున్నారు. తక్షణమే అధికారులు సెల్ టవర్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు, సీదరి భాస్కరరావు, పాంగి సూరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.