ప్రజాశక్తి-నందిగామ : రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ పట్టణంలోని శాసనసభ్యుల కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు . పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.










