Apr 05,2023 16:16

ప్రజాశక్తి-కారంచేడు : మాజీ ఎంపీ దగ్గుబాటి రామానాయుడు సోదరుడు, సినీ నిర్మాత మోహన్ బాబు73(రామ్మోహన్) పార్థివ దేహానికి పర్చూరు శాసనసభ్యులు, టిడిపి బాపట్ల జిల్లా అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు నివాళులర్పించారు. కారంచేడులోని ఆయన నివాసంలో గురువారం నాడు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును, మోహన్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.