May 29,2023 16:14

ప్రజాశక్తి - రేపల్లె : 2018లో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినా రైస్ మిలర్ పై చర్యలు తీసుకోవాలని,రైతులకు రావలసినా డబ్బులు వెంటనే చెల్లించే విదంగా ప్రభుత్వం బాద్యత తీసుకోవాలిని ఏపి రైతుసంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు స్థానిక డీఎస్పీ మరియు ఆర్డీఓ కి రైస్ మిల్లర్ కస్తూరి.రాధకృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలన,రైతులకి డబ్బులు చెల్లించాలినీ వినతిపత్రాలు  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రేపల్లె డిఎస్పి,ఆర్డిఓ ఆఫీసులు వద్ద రైతులు నిర్వహించిన ఆందోళనలో రైతుసంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి. వెంకటరామయ్య  మాట్లాడుతూ రైతులు దగ్గర 2018 అప్పుడు రైస్ మిలు నిర్వహించానా కస్తూరి.రాధకృష్ణ మూర్తి ధాన్యం కొనుగోలు చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేయటంతో రైతులు నాలుగు సంవత్సరాల కాలం నుండి రైస్ మిల్లు యాజమానీ మీద పోలీస్ వారికి,జిల్లా కలెక్టర్ కి ఇతర అధికారుల దృష్టికి పలు దపాలు తీసుకువెళ్లినా  రైస్ మిల్ యజమాని మీద ఒత్తిడి చేసి మోసపోయిన రైతులుకి డబ్బులు జమ చేయచకపోవటం అంటే ఉదేశపుర్వకంగా జాప్యం జరిగిందని విమర్శించారు. మోస పోయినా రైతులు అప్పులుకి వడ్డీలు చెల్లించలేక తీవ్రమైనా ఇబ్బందులు పడుతుంటే  రైస్ మిల్ యజమాని దర్జాగా తిరుగుతున్నాడని వెంటనే జాయింట్ కలెక్టర్ స్థాయిలో ధాన్యం అమ్మినటువంటి రైతులా లిస్టు తయారుచేసి డబ్బులు జమ చేయించాలిని,లేని నేపథ్యంలో రైతుసంఘంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మద్దతుగా పాల్గొన్న సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రైతులా దగ్గర కొనుగోలు చేసినా ధాన్యంకి 2019 నవంబర్ లో లెక్క తేల్చగా సుమారు కోటి రూపాయలు వరకు తేలినట్లు,2020 జనవరి నాటికి ప్రతి రూపాయి ఇస్తానని పోలీస్ స్టేషన్లో ఒప్పుకోని రైస్ మిల్లు యజమాని నేటికీ డబ్బులు చెల్లించకపోవడం వల్ల,చిన్న రైతులు,కౌలురైతులు లక్షలాది రూపాయలు డబ్బులు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.కరోనాకాలంలో డబ్బులు లేక మోసపోయినా రైతులో ఇద్దరు రైతులు మానసిక ఆందోళనతో ప్రాణాలు  కోల్పోయారు,అయనప్పటికి రైస్ మిల్ యజమాని డబ్బులు చెల్లించా లేదు,ఈ నేపధ్యంలో ధాన్యం అమించినా వ్యాపారస్తుడు,మరియు రైతులు పోలీస్  కేసు పెట్టగా 2020 అక్టోబర్లో ఎఫ్ఐఆర్ నమోదైనది. కానీ అప్పటినుండి 2023 ఏప్రిల్ నెల వరకు చార్ట్ షిట్ దాఖలు చేయకుండా ఉండటం ద్వారా కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో మోసం చేసినా రైస్ మిల్లర్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, కావున  త్వరితగతిన కేసు విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వా అదికారులు రైస్ మిల్లు యజమాని వద్ద ఉన్నా డాక్యుమెంట్స్,పుస్తకాలను పరిశీలించి రైతులకు ఇవ్వవలిసినా ప్రతి రూపాయి రైతులకు అందేలాగా  చర్యలు తీసుకోవాలి. పలు దపాలు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు కూడా రైతులు ఇ సమస్యను తెలియజేసినట్లు చెప్తున్నారు. కావున కష్టపడి వ్యవసాయం చేసి ధాన్యం పండిచినా రైతులకు న్యాయం జరిగేలాగ ప్రజా ప్రతినిధులు కూడా చొరవ చేయాలని, రైతులుకి డబ్బులు చెల్లించేవరకు రైతు, కౌలురైతు సంఘాలు నిర్వహించే ఆందోళనకు సిపిఎం పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు కే.కోటేశ్వరరావు, టి.నరసింహారావు కే.మహేష్, కె.వాసు ఆర్. వెంకటేశ్వరరావు, కే.హనుమంత్ మరియు రైతు, కౌలురైతు సంఘలా నాయకులు బి.సుబ్బారావు, కె.ఆశీర్వాదం,కే. రమేష్ తదితరులు పాల్గొన్నారు.