Apr 03,2023 07:47

సింధువంత ద్ణుఖాన్ని మోయలేక
కన్నీటి బిందువు ఓడి పోయింది!
హృదయ ఘోషని
విప్ప లేక భాష ఓడిపోయింది!
తత్వం తెలియక కవిత్వం ఓడిపోయింది!
తిమిరాన్ని తరమలేక
మిణుగురు ఓడిపోయింది!
రాత్రి స్వప్నాలను సాకారం చెయ్యలేక
ధరిత్రి ఓడిపోయింది !
మానవత్వపు గాయాలు మాన్చలేక
న్యాయం ఓడిపోయింది !
నేతల రాతలు నమ్మి
ప్రజాస్వామ్యం ఓడిపోయింది !

కానీ, చెట్టు ఓడిపోలేదు
రాతిలో కూడా తేమని తీసుకుని
ప్రతి వత్సరం వసంతాన్ని ఇస్తోంది !
 

- వీరేశ్వర రావు మూల
9494746228