బగొట : విమానం ప్రమాదం బారీన పడి అమెజాన్ అడవుల్లో సుమారు ఐదు వారాలు ఒంటరిగా గడిపిన నలుగురు కొలంబియా చిన్నారులు ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అమెజాన్ అడవుల నుంచి వీరి రక్షించిన తరువాత బగొట మిలటరీ ఆసుపత్రులో చికిత్స అందించారు. 34 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తరువాత వీరిని ఈ నెల 14న డిశ్చార్జ్ చేశారు. మే 1 జరిగిన విమాన ప్రమాదంలో చిన్నారులు తమ తల్లిని, ఇద్దరు ఇతర పెద్దవాళ్లను కొల్పోయారు. వీరు అడవిలో చిక్కుకుని పోయారు. సమారు 200 మంది సైనికులు, స్థానికులు నిర్వహించిన భారీ గాలింపు చర్యల తరువాత గత నెలలో వీరిని కనుగొన్నారు. వీరిలో ఒక ఏడాది వయస్సు ఉన్న చిన్నారి కూడా ఉంది. 40 రోజుల పాటు వీరు ఒంటరిగా గడపడం ప్రపంచ వ్యాప్తంగా పతకా శీరిషకలకు ఎక్కింది. వీరిలో పెద్ద అమ్మాయి (లెస్లీ, 13 ఏళ్లు) ధైర్యంగా ఉండటం, అమెకు అడవులపై మంచి అవగాహన ఉండటం ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.










