ప్రజాశక్తి-రేపల్లె : రూరల్ మండలం సోడాయపాలెం గ్రామానికి చెందిన మండే రత్నబాబు అనే వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నడంతో వారికి చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ మూడు లక్షల 50వేలు చెక్కు మంజూరు కావడంతో వారి కుటుంబ సభ్యులకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడంతో వారికి మంజూరు కావడంతో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే సీఎం జగన్ ధ్యేయమన్నారు. నిరుపేదలకు ఆర్థిక భారం కాకుండా వైద్యానికి అయ్యే ఖర్చులను సీఎం జగన్ అందిస్తు్న్నారన్నారు. మంజూరుకు కృషిచేసిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారుడు మోపిదేవి వెంకటరమణారావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.










