
జైపూర్ : కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే.. కుటుంబపెద్ద అయిన మహిళకు ఏడాదికి విడతల వారీగా రూ.10,000 అందిస్తామని ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ ప్రకటించారు. బుధవారం ఝున్‌ఝున్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. '' గృహలక్ష్మి గ్యారెంటీ'' పథకం కింద ఏడాదికి ఇంటి పెద్ద అయిన మహిళకు రూ.10,000 నగదు అందిస్తామని ప్రకటించారు. అలాగే కోటికి పైగా కుటుంబాలకు వంటగ్యాస్‌ను తగ్గించి రూ.500కే అందిస్తామని హామీ ఇచ్చారు.
నవంబర్ 25న రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 25న ఒకేదశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.