వాడెళ్లేచోట
పుడమి పచ్చరంగేస్తుంది
వాడు నడిచేచోట
ధాన్యపు గింజలు మురిసిపోతున్నాయి
వాడడుగేసే ప్రాంతమంతా
పిట్టలు సందడిచేస్తున్నాయి
వాడు తిరిగేచోట
కూడుకి లోటు తెలియని మనుషులున్నారు
వాడి దేహం చుట్టూ పీక్కుతినే
అవినీతి లేదు
ఒంటినిండా సూదులతో పొడిచి
గందరగోళం చేసే సమస్యల్లేవుఊ
అతనిప్పుడు మనసు నిండా
తృప్తిని కప్పుకున్నాడు
అతనిప్పుడు
స్వేచ్ఛని పరిచే పరదా అయ్యాడు
మనుషుల్ని మరింత బతికించే
లోక అంబాసిడరయ్యాడు !
...
రాత్రొచ్చిన కలని వెత్తుక్కుంటూ వెళ్ళా
తూర్పు పొలంలో
కలుపు మొక్కల్ని పీకుతూ కనిపించాడు
అన్నపూర్ణ పుత్రుడు
అలియాస్ మట్టిమనిషి!
ఈ కల నిజమైతే ఎంత బాగుణ్ణు !
- అడ్డూరి










